నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. రాహుల్‌ చెప్పిందే నేను చెప్పా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సమావేశమయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, రాహుల్‌ చెప్పిందే తాను చెప్పానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఇలా ఉంటుందన్నా.. అర్ధం చేసుకునేదాన్ని బట్టి ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో హంగ్‌ వస్తుందని తాను అనలేదని, తానేం తప్పు మాట్లాడలేదని, రాద్ధాంతం చేయెద్దని ఎంపీ కోమటిరెడ్డి వెల్లడించారు. సోషల్‌ మీడియా సర్వేలను బట్టి మాట్లాడుతున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సీట్లపై వ్యాఖ్యలు తన వ్యతిగతమని ఎంపీ కోమటిరెడ్డి స్పష్టం చేశారు.అనంతకు ముందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ పార్టీకి లేదని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని తెలిపారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తానని ఠాక్రే తెలిపారు. పొత్తులపై రాహుల్‌ వరంగల్‌ సభలో చెప్పిందే ఫైనల్‌ అని ఠాక్రే స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. ఆయనపై పార్టీ నేతలు ఏం మాట్లాడారనే విషయం కూడా తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీకి నష్టం కలిగించే విధంగా చర్యలు, మాటలను పార్టీ అధినాయకత్వం నిశితంగా గమనిస్తుందని అన్నారు. ఈ విషయాలన్నింటిపైనా అధిష్టానం పరిధిలోనే నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్రలో ప్రజలు తనకు వివరించే సమస్యల మీదే ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు

Leave A Reply

Your email address will not be published.