వాళ్లు మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉంటారు…రెచ్చిపొతే ఏలా?

-   రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాకరే ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  నేను సావర్కర్‌ను కాదుక్షమాపణ చెప్పను” అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు (బీజేపీ) మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. మనం కూడా అదుపుతప్పితే దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోతుంది అని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే అన్నారు.  సావర్కర్ తమ దేవుడనిఆయనను ఇలా అవమానిస్తూ పోతుంటే మహారాష్ట్ర విపక్ష కూటమిలో చీలికలు వస్తాయని పరోక్షంగా రాహుల్‌ను హెచ్చరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్శివసేన ఉద్ధవ్ వర్గంఎన్‌సీపీ మహాకూటమిగా ఉన్నాయి.రాహుల్‌కు ఒక మాట చెప్పదలచుకున్నాను. మనం కలిసి పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యంరాజ్యాంగ పరిరక్ష కోసం మనమంతా కలిసి ఉన్నాం. భారత్ జోడా యాత్రలోనూ మీ వెంట ఉన్నాం. సావర్కర్‌ని మా దేవుడిలా భావిస్తాం. ఆయనను అవమానించడం మానుకోవాలి. లేదంటే సహించమని స్పష్టంగా చెప్పదలచుకున్నాను” అని థాకరే అన్నారు.

Leave A Reply

Your email address will not be published.