నా పట్ల అమానుషంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య గుడ్డలు చించారు

- అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది: చింతమనేని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ‘‘నా పట్ల అమానుషంగా ప్రవర్తించి ప్రజాస్వామ్య గుడ్డలు చించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి’’ అంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో చింతమనేని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు చింతమనేని చొక్కా చించివేశారు. చిరిగిన చొక్కతో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చింతమనేని మీడియాతో మాట్లాడుతూ…. అత్యుత్సాహం చూపిన పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చింతమనేనికి పట్టిన గతి పడుతుందని తనను ఉదాహరణగా చూపాలనుకుంటున్నారని అన్నారు. డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.