ఇటు బాన్సువాడ బల్దియా .. అటు బోర్లం పంచాయతీ

రెండింటికి భారీగా పన్ను ఎగవేత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిధి: అధికారుల నిర్లక్ష్య మో పాలకుల తప్పిదమో కానీ ఏళ్ల తరబడి లక్షల రూపాయల్లో పన్ను ఎగవేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .వివరాల్లోకి వెళితే బాన్సువాడ పట్టణ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహ ఎడ్యుకేషన్ సొసైటీ భవనం కు 2014 -15 సంవత్సరంలో బాన్సువాడ మేజర్ గ్రామపంచాయతీ నుండి అనుమతులు పొంది అక్కడ భవన నిర్మాణాన్ని చేపట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ను నిర్వహిస్తున్నారు .కానీ పన్ను మాత్రం కేవలం రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా చూపిస్తూ సంవత్సరానికి 20వేల రూపాయలు చెల్లిస్తున్నారు .నిబంధనల ప్రకారం కమర్షియల్ గా కట్టడాలను వినియోగిస్తే ట్యాక్స్ ను కూడా దాని నిబంధనలకు అనుగుణంగా చెల్లించాల్సి ఉంటుంది. సుమారు అక్కడ నిర్మాణం జరిగిన కట్టడాలకు ఏడాదికి లక్ష పైచిలుకు పన్ను కట్టవలసి ఉండగా కేవలం ఏళ్ల తరబడి 20వేల రూపాయల టాక్స్ ని చెల్లించడం గమనార్హం. దీంతో బాన్స్వాడ బల్దియాకు భారీగా నష్టం చేకూరుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ లక్ష్మీనరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలోని కొంత స్థలం బాన్సువాడ శివారు మరికొంత స్థలం బోర్ల శివారులో ఉండడంతో సదరు ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు సంబంధిత బోర్లం గ్రామపంచాయతీ నుండి సైతం అనుమతులు పొందారు. కానీ అనుమతులు పొందిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి పన్నులు చెల్లింపులు చేయకపోవడం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. సంబంధిత పంచాయతీ రికార్డుల్లో కూడా పన్ను మినహాయింపు అని రికార్డుల్లో ఉండడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది దీంతో బోర్ల గ్రామపంచాయతీకి సైతం పన్ను ఎగవేతతో ఆదాయానికి గండి పడింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలకు ,మందిరాలకు ప్రభుత్వ సంబంధిత భవనాలకు మాత్రమే పన్నుమినాయింపు ఉంటుంది .కానీ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లకు ఎలాంటి పన్నులు మినహయింపు ఉండదు.

ఈ విషయమై సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి నీ తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా తాను ఇక్కడ కొత్తగా వచ్చానని రికార్డుల్లో తనిఖీ చేసి చూసేసరికి నేటి వరకు ఏళ్ల తరబడి ఎలాంటి పన్నులు చెల్లించిన దాఖలాలు లేవని అదేవిధంగా పన్ను మినహాయింపు అని డిమాండ్ ,రివిజన్ రిజిస్టర్ లలో నమోదయి ఉందని ఆయన సమాధానం ఇచ్చారు.

దీంతోపాటు బాన్సువాడ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ ని శ్రీ లక్ష్మీనరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ యజమానులు కేవలం పన్నుని రెసిడెన్షియల్ ప్లాట్ గా చూపి చెల్లింపు చేస్తున్నారని అది కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ పన్ను ఎందుకు వసూలు చేయడం లేదని వివరణ కోరగా. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమ మున్సిపాలిటీకి రావాల్సిన పన్ను మొత్తం రికవరీ చేసే దిశగా చర్యలు చేపడతామని ఆయన సమాధానం ఇచ్చారు..

Leave A Reply

Your email address will not be published.