ఇది విగ్రహం కాదు.. ఒక విప్ల‌వం.

- ఇది ఆకారానికి ప్ర‌తీక కాదు..తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక -     ముఖ్య‌మంత్రి కేసీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఇది విగ్ర‌హం కాదు.. ఒక విప్ల‌వం. ఇది ఆకారానికి ప్ర‌తీక కాదు.. ఇది తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక అని అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ హృద‌యపూర్వ‌కంగా జై భీమ్ తెలియ‌జేస్తున్నాను. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌యంతి నిర్వ‌హిస్తున్నాం. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోషాన్ని తెలియ‌జేస్తున్నాం. సంవ‌త్స‌రాలు, శ‌తాబ్దాలు గ‌డిచిపోతున్నాయి.ఒక్క‌టే మాట మ‌నవి చేస్తున్నాను. అంబేద్క‌ర్ విశ్వ‌మాన‌వుడు. అంబేద్క‌ర్ ప్ర‌తిపాదించిన సిద్ధాంతం విశ్వ‌జ‌నీన‌మైన‌ది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో ప‌రిమితమైంది కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అంబేద్క‌ర్. ఈ రోజు ఆయ‌న ర‌చించిన రాజ్యాంగం 70 సంవ‌త్స‌రాలు దాటిపోతోంది. ఆయ‌న చెప్పింది ఆచ‌రించాలి. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ జ‌ర‌పాలి. మ‌న నూత‌న స‌చివాయ‌లానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాం. ప్ర‌తి రోజు స‌చివాల‌యానికి వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఈ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని చూస్తూ ప్ర‌భావితం కావాలి. ఆయ‌న సిద్ధాంతం, ఆచ‌ర‌ణ క‌ళ్ల‌లో మెద‌లాల‌ని ఈ విధంగా రూప‌క‌ల్ప‌న చేశాం అని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.వచ్చే ఏడాది 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర తీరాన సమతామూర్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ప్రకాశ్‌ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానని చెప్పి వెళ్లాను.పార్లమెంట్‌లో బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు తిరిగిరావడం జరిగింది. ప్రకాశ్‌ అంబేద్కర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి ఇక్కడ కార్యక్రమాలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఇదే రకమైన కార్యక్రమాలు చేసేందుకు పార్టీని జాతీయంగా విస్తరించారన్నారు. మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రికి ఉండాలని ఆయన మీకు చెప్పారు. నేను ఒక్కటే మాట చెబుతున్నారు. ఈ విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలి. తప్పకుండా 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. కానీ, ఒక చిన్న మినుగురు చాలు అంటుకోవడానికి. ఈ మధ్య మహారాష్ట్రకు పోతే నా కలలో కూడా ఊహించని విధంగా ప్రోత్సాహం ఆదరణ వస్తది. రేపు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో, బెంగాల్‌లో కూడా వస్తుంది’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హా శిలాఫ‌ల‌కాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ఆవిష్క‌రించారు.

Leave A Reply

Your email address will not be published.