మార్చినెల‌లో ఎనిమిదేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి భారీ వ‌ర్షం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు భారీ వ‌ర్షంకురిసిన విష‌యం విదిత‌మే. హైద‌రాబాద్‌లో మార్చినెల‌లో ఈ స్థాయిలో వ‌ర్షం కురియ‌డం ఎనిమిదేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. గురువారం రోజు హైద‌రాబాద్‌లో 31.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.2014లో ఇదే హైద‌రాబాద్ న‌గ‌రంలో మార్చి 5వ తేదీన అతి భారీ వ‌ర్షం కురిసింది. నాడు 38.4 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 2015లో 18.77 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖఅధికారులు వెల్ల‌డించారు. అయితే రాబోయే రెండు రోజుల పాటు కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. భారీ వ‌ర్షాల‌తో పాటు వ‌డ‌గండ్ల వాన కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు అవ‌స‌ర‌ముంటేనే బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.