తితిదే దర్శనం టిక్కెట్లు విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు తితిదే వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా బుక్‌చేసుకోవాలని సూచించింది.

నేడు అంగప్రదక్షిణం టోకెన్లు..:

మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతోపాటు, ఈనెల 23 నుంచి 28 తేదీ వరకు సంబంధించిన టోకెన్లను శనివారం ఉదయం 11 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

14న వృద్ధులు, వికలాంగుల కోటా టోకెన్లు:

శ్రీవారి దర్శనానికి సంబంధించి వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత టోకెన్ల కోటాను ఈనెల 14న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.