ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలి

- రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారన జరపాలని కోరుతూ రాష్ట్ర డీజీపీ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. 12 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ ప్రబలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ లో చేర్చుకున్న అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని, జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేశామని వివరించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో ఫిర్యాదు చేశామని తెలిపారు. అందువల్ల ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కు సంబంధించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఆర్.ఐ కేసు నెంబర్ 455 లో తమ ఫిర్యాదు ను కూడా జత చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్టు.పేర్కొన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2018 వరకు 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీ లను వివిధ పార్టీ ల నుంచి టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. 2018 లో ఎన్నికలు జరిగాక మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చారు. 12 మంది ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రకాల లబ్ది చేకూర్చారు. 12 మంది ఎమ్మెల్యేలు లు నేరాలకు అలవాటు పడ్డ వారుగా గుర్తింపు పొందారు. 12 మందిలో 3 ఎమ్మెల్యేలు గతంలో పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ లోకి మరెందుకు జరిగిన వ్యవహారంలో కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసు ను సీబీఐకి ఇస్తున్న నేపత్యంలో 12 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాలను కూడా జత చేసి సీబీఐ.కి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.