పులకించిన ప్రకృతి…సాయం సంధ్యవేళ కనువిందు చేసిన ఇంద్రధనుస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: ఇంద్రధనస్సు ఎక్కడ కనిపించినా పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా వీక్షిస్తారు, మరి అలాంటి సప్తవర్ణాల ఇంద్రధనుస్సు పచ్చటి వరి పొలాల మధ్య కనువిందు చేస్తే, ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. పులకించిన ప్రకృతి సాయం సంధ్యవేళ కనువిందు చేసిన ఇంద్రధనుస్సు,
హరివిల్లు, చిరుజల్లు, చుక్కలు, ఆకాశం. అన్నీ అందరి కోసం అని ఓ సినీ కవి వర్ణిస్తే.. ఆకాశంలో అందమైన రంగు రంగుల చాపం ఇంద్ర ధనుస్సు అని మరి కొందరు తమ సంతోషన్ని వ్యక్తం చేస్తారు. సప్తవర్ణాలన్నీ ఏకమై ఆకాశంలో అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ భూమిలో ఉన్నట్టు వృత్తాకారం అంబరాన్ని తాకుతున్నట్లు కనిపిస్తూ కనులవిందు చేస్తుంది ఇంద్రధనస్సు. సూర్య రశ్మితో తయారయ్యే ఈ ఇంద్రధనుస్సు. ఎప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది, అయితే ఈ ఇంద్రధనస్సు ఎక్కడ కనిపించినా పిల్లలు, పెద్దలు ఎంతో సంతోషంగా వీక్షిస్తారు. మరి అలాంటి సప్తవర్ణాల ఇంద్రధనుస్సు పచ్చటి పొలాల మధ్య కనువిందు చేస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మరి అలాంటి దృశ్యం ఆవిష్కృతం అయింది కామారెడ్డి జిల్లా, ముసురుల్లాబాద్ మండల పరిధిలోని ,హాజీపూర్ గ్రామంలో. పచ్చని ప్రకృతి. అందాలకు పుట్టినిల్లు అద్భుతం చోటుచేసుకుంది సాయం సంధ్యవేళ ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా అభివర్ణించారు. మొదటిది ప్రాధమిక ఇంద్రధనుస్సు. ఇందులో వృత్తం పై భాగంలో ఎరుపు లోపలి భాగంలో ఊదా రంగులో ఉంటాయి. రెండది ద్వితీయ ఇంద్రధనుస్సు ఇందులో ప్రాథమిక ఇంద్రధనుస్సులోని వర్ణాలు తిరగేసి దర్శనమిస్తాయి.

Comments are closed.