టిఫా స్కానింగ్ మిషన్ ప్రారంభించిన స్పీకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణంలోని మాతా-శిశు ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ ను శనివారం  తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి  ప్రారంభించారు. ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ ఆధునిక స్కానింగ్ యంత్రం గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని, బాన్సువాడ MCH లో నెలకు 350 వరకు ప్రసవాలు జరుగుతుండగా ఇందులో 60 శాతం సాదారణ ప్రసవాలే అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంతో పాటుగా జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గ ప్రజలకు మాత శిశు ఆసుపత్రి ఉపయోగంగా ఉందన్నారు. మౌళిక సదుపాయాలు పెంచడం, ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీల సంఖ్య భారీగా పెరిగిందని, గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకురావడానికి అమ్మ ఒడి వాహనం 102 అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ   లక్ష్మణ్ సింగ్, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సొసైటి అధ్యక్షులు కృష్ణరెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రాంరెడ్డి, జెడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ జుబేర్, తెరాస పార్టీ అధ్యక్షులు పాత బాల కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, కో ఆప్షన్ మెంబర్ అలిమొద్దీన్ బాబా, మైనారిటీ ప్రధాన కార్యదర్శి యండి. దావూద్, స్థానిక కౌన్సిలర్ బాడీ శ్రీను, షాదీఖానా చైర్మన్ వాహబ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, కౌన్సిలర్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.