మొగిలిగుండ్ల పంట పొలాల్లో టైం మిషన్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వికారాబాద్‌లో టైం మిషన్‌ను పోలి ఉన్న ఒక భారీ వస్తువు ఆకాశం నుంచి నేల మీదకు పడిపోయిన విషయం తెలిసిందే. మర్పల్లి మండలం మొగిలిగుండ్ల పొలాల్లో ఇది పడిపోవడంతో జనం ఒకింత ఆశ్చర్యంతో పాటు కాస్త భయపడ్డారు. అదేంటో తాజాగా సైంటిస్టులు తేల్చారు. అది స్పెయిన్ దేశానికి చెందినదిగా సైంటిస్టులు గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్లు దీనిని రూపొందించారని. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగమని తేల్చారు. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పెయిన్ దేశంలో టూరిజానికి దీనికి వినియోగించనున్నట్టు సమాచారం. బెలూన్ సహాయంతో దీనిని ప్రయోగించినట్టు అధికారులు వెల్లడించారు. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనిచోటే దిగేలా చూస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.