అమ్మకానికి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమే లక్ష్యంగా అడుగులు ముందుకేస్తున్న కేంద్ర ప్రభుత్వం దృíష్టి ఇప్పుడు విమానాశ్రయాలపై పడింది. ఏటా రూ.200 కోట్లపైనే లాభాలు ఆర్జిస్తున్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం తాజాగా అమ్మకానికి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి విమానాశ్రయానికి రద్దీ ఎక్కువ. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. దీంతో సహజంగానే తిరుపతి విమానాశ్రయానికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని వసతులు కల్పించి అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాల్సిన కేంద్రం అమ్మకానికి పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.ఒక్క తిరుపతి విమానాశ్రయమే కాకుండా ఏపీలో విజయవాడ (గన్నవరం) రాజమండ్రి విమానాశ్రయాలను కూడా కేంద్రం ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా తిరుపతి విమానాశ్రయానికి కనీసం టెండర్లను కూడా పిలవకుండానే విక్రయించడానికి కేంద్రం సిద్ధమైందని సమాచారం.భారీ స్థాయిలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్న తిరుపతి ఎయిర్ పోర్టును దక్కించుకొనేందుకు జీఎంఆర్ టాటా రిలయన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడింటిలో రిలయన్స్ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ విమానాశ్రయాన్ని కారు చౌకగా దక్కించుకొని దీనిపక్కనే ఉన్న మరో 300 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా దక్కించుకోవాలనే ప్రయత్నాలు రిలయన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు వందల ఎకరాల్లో మాల్స్ రెస్టారెంట్లు స్టార్ హోటళ్లు నిర్మించే ప్రణాళికల్లో రిలయన్స్ ఉందని తెలుస్తోంది.సాధారణ రోజుల్లో రెండు వేలు వేసవి నాలుగు నెలల కాలంలో రోజుకు మూడు వేల మంది ప్రయాణికులు వస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ విమానాలను తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి తిరుపతికి విమానాలు నడపడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇంతలోనే కేంద్రం అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయంలో ఒకేసారి మూడు విమానాలు ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. కేవలం ప్రయాణికులే విమానాలే కాకుండా కార్గో విమానాలు సైతం రాకపోకలు సాగించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. 550 కార్లను పార్కింగ్ చేయగల సామర్థ్యం ఉంది. కొంతమంది పారిశ్రామికవేత్తల సినీతారల వ్యక్తిగత ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఆదాయం కూడా ఈ ఎయిర్ పోర్టుకు పెద్ద ఎత్తున లభిస్తోంది. దీంతో కార్పొరేట్ కంపెనీల కన్ను ఈ విమానాశ్రయాన్ని దక్కించుకోవడంపై పడ్డాయి.తిరుపతి విమానాశ్రయానికి ప్రస్తుతం ఢిల్లీ విశాఖపట్నం విజయవాడ చెన్నై బెంగళూరు మైసూరు హైదరాబాద్ ల నుంచి రోజుకు 15 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో ఇండిగో ఐదు ఎయిరిండియా నాలుగు స్పైస్ జెట్ ఐదు ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి ఉన్నాయి. సిబ్బంది జీతభత్యాలు నిర్వహణ మొత్తం ఖర్చులుపోను గత ఐదేళ్లగా ఏటా సుమారు రూ.200 కోట్లు చొప్పున లాభాలు వస్తున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 623341 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 8150 ట్రిప్పులు విమానాలు తిరిగాయి. అలాగే 83 కార్గో విమానాలు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేశాయి.

Leave A Reply

Your email address will not be published.