నేడు వరల్డ్ హిందీ డే

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విదేశాల్లో హిందీ భాషను ప్రోత్సహించేందుకు ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్ర‌ధాన మంత్రి మన్మోహ‌న్‌సింగ్ నేతృత్వంలో 2006లో జ‌న‌వ‌రి 10న ప్రపంచ హిందీ తొలి దినోత్సవాన్ని నిర్వ‌హించారు. అంత‌కు ముందు ప్రపంచవ్యాప్తంగా భాషను ప్రోత్సహించే లక్ష్యంతో నాగ్‌పూర్‌లో 1975 జ‌న‌వ‌రి 10న మొదటి ప్రపంచ హిందీ సదస్సు నిర్వహించారు. ఈ స‌ద‌స్సుకు 30 దేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ప్రపంచ హిందీ సదస్సు జ‌రిగిన రోజునే ప్రపంచ హిందీ దినోత్సవంగా పాటించ‌డం మాత్రం 2006 నుంచే మొద‌లైంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు కూడా ఏటా ఈ దినోత్సవాన్ని పాటిస్తాయి. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కొలంబోలోని భారత హైకమిషన్ సాంస్కృతిక విభాగం, స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ కొలంబోలోని శ్రీలంక ఫౌండేషన్‌లో రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించింది.

Leave A Reply

Your email address will not be published.