నగరంలో కుండపోత వర్షం.. జలమయమైన  రోడ్లు

-       ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారుల హెచ్చరిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, KPHB , మియపూర్ కుత్బుల్లాపూర్, బోరబండ, జీడిమెట్ల, ఫిల్మ్‌‌నగర్, బంజారాహిల్స్‌లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం పడుతోంది. అలాగే మూసాపేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేసింది. జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షం నేపథ్యంలో రోడ్లు జలమయమైయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న గంటలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.