న్యూ ఇయర్ వేళా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఇప్పటికే యువత న్యూ ఇయర్ పార్టీ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఇక యువత రోడ్ల మీద వాహనాలతో రయ్ రయ్ అంటూ చేసే హంగామా అంతా ఇంతా కాదు.  అయితే మద్యం మత్తులో యువత రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి చెప్పనక్కర్లేదు. ఒకరికొకరు పోటీ పడి మరి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటారు. కళ్లు మూసి తెరిచేలోపు ప్రమాదాలు జరిగిపోతాయి.  ఈ క్రమంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు. రేపు రాత్రి ఈ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుండి జనవరి 1న తెల్లవారుజామున 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

సైబరాబాద్ పరిధిలో పలు కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఓఆర్ఆర్ పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు వాహనాలను అనుమతించరు. కేవలం ఎయిర్ పోర్టుకు వెళ్లే వెహికల్స్ ను మాత్రమే అనుమతించనున్నారు. పివి నరసింహారావు ఫ్లై ఓవర్ పై ఈ నిబంధనలే అమలులో ఉండనున్నాయి. గచ్చిబౌలి శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, మైండ్ స్పెస్, దుర్గం చెరువు తీగల వంతెన, షేక్ పేట, రోడ్ నెంబర్ 45 ఫ్లై ఓవర్, బయో డైవర్సిటి, పార్క్ ఫ్లై ఓవర్ లెవల్ 1, 2, సైబర్ టవర్, ఫోరం మాల్, JNTU, బాలానగర్ బాబు జగజ్జీవన్ రాం, కైత్లాపూర్ వంతెన పైకి వాహనాలను అనుమతించమని పోలీసులు తెలిపారు.

ఈ ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు. లిబర్టీ కూడలి,అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబెడ్కర్ కూడలి వద్ద దారి డైవర్ట్ చేస్తారు. ఖైరతాబాద్ మీదుగా నెక్లస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారీ భవన్, రాజ్ భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. ఇక మింట్ కాంపౌండ్ రోడ్డును పూర్తిగా బంద్ చేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్క్ వైపు వెళ్లే వెహికల్స్ ను రాణిగంజ్ మీదుగా డైవర్ట్ చేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయం మీదుగా మళ్లించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

 అర్ధరాత్రి వరకు మెట్రో..

న్యూ ఇయర్ సందర్బంగా మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. నేడు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఒంటి గంటకు చివరి మెట్రో రైలు స్టార్ట్ కాగా 2 గంటలకు చివరి స్టేషన్ కు చేరుకుంటుందని తెలిపారు. అయితే మందబాబులు మెట్రోలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండగా న్యూ ఇయర్ సందర్బంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని మరో 3 గంటలు అదనంగా పెంచారు.

 

 

Leave A Reply

Your email address will not be published.