సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Kaikala-Satyanarayana-1200.jpg

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ హైదరాబాద్ ప్రతినిధి: తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ హీరో కైకాల సత్యనారాణయ (87) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇంట్లోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున మరణించిన ఆయన ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు కుటుంబ సభ్యులు. కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.