స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండాకు నివాళులర్పించిన బండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గిరిజన వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ మహా వీరుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం ఘాన నివాళులు అర్పించారు.  గిరిజన వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిషు పాలకులపై తిరుగుబావుటా ఎగరేసి గిరిజన జాతిని ఏకం చేస్తూ అనేక పోరాటాలకు సారథ్యం వహించాడని, అతి పిన్న వయసులోనే (24 ఏళ్లకే) జైలులో మరణించినప్పటికీ గిరిజనులందరినీ ఏకం చేస్తూ బిర్సాముండా సాగించిన వీరోచిత పోరోటాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు. బిర్సాముండా గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆయన స్మారకార్థం మ్యూజియంను నిర్మించారు. గిరిజన వీరుడు బిర్సా ముండా పోరాటాలను స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం నవంబర్ 15 న ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా నిర్వహిస్తూ ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తోందని తెలిపారు. బిర్సాముండా పోరాటాలు నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన స్పూర్తితో తెలంగాణలోని గిరిజనులంతా తమ హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.