సిపిఐ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా గురువారం మల్కాజ్గిరి మండల పరిధిలోని ఆర్కే పురం రైతు బజార్ పోలింగ్ బూత్ సమీపం దగ్గర సి.పి.ఐ కార్యకర్త గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి ఆరేపల్లి కమలాకర్ పై బి.ఆర్.ఎస్. బైండవర్ గుండాలు మదన్మోహన్ రాజు డేవిడ్ ,బి. కిరణ్ సైదిరెడ్డి రమేష్ అర్జున్ సంతోష్ శేఖర్ చోటు అనే బైండోరు గుండాలు టి.ఆర్.ఎస్. అత్యాయత్యానికి ప్రయత్నించగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ విషయం తెలిసిన సి.పి.ఐ. నాయకులు హుటాహుటిన అక్కడికి చేరుకొని కమలాకర్ ను మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడ వారు ప్రథమ చికిత్స చేసి గాంధీ హాస్పిటల్ కు పంపడం జరిగింది గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల ముందు ఈ బి ఆర్ ఎస్ గుండాలు మర్రి రాజశేఖర్ రెడ్డి కి ప్రచారం చేయాలని పది లక్షలు ఇస్తామని మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి మరి లక్ష్మారెడ్డి మదన్ మోహన్ రాజు తో కొందరు బిఆర్ఎస్ నాయకులు తమ వద్దకు వచ్చి ఆఫర్ చేశారని కమలాకర్ నేను సి.పి.ఐ .పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది కాబట్టి టిఆర్ఎస్ కు ప్రచారం చేయనని నిరాకరించారు అది దృష్టిలో పెట్టుకుని నాపై దాడి చేశారని ఆరోపించారు పై విషయం నేరేడ్మిట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమలాకర్ పై దాడి పై సి.పి.ఐ. మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి యాదయ్య గౌడ్ సహాయ కార్యదర్శి కాసర్ల నాగరాజు నాయకులు బి.యాదగిరి ఆర్. వెంకటేష్ ఎస్. కె .అజీజ్ ఏం లింగం కే ప్రభాకర్ బాలయ్య తదితరులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.దోషులను కటినంగా శిక్షించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.