టిఎస్ సెట్ 2023  నోటిఫికేష‌న్‌ను ఉస్మానియా విశ్వ విద్యాల‌యం విడుద‌ల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర అర్హ‌త ప‌రీక్ష టిఎస్ సెట్ 2023  నోటిఫికేష‌న్‌ను ఉస్మానియా విశ్వ విద్యాల‌యం విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీల లెక్చ‌ర‌ర్లు అర్హ‌త సాధించేందుకు ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అర్హులైన అభ్య‌ర్థులు ఆగ‌స్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పేప‌ర్ 1లో 50 ప్ర‌శ్న‌ల‌కు 100 మార్కులు, పేప‌ర్ 2లో 100 ప్ర‌శ్న‌ల‌కు 200 మార్కులు కేటాయించ‌నున్నారు. ప‌రీక్ష కాల వ్య‌వ‌ధి మూడు గంట‌లు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సెట్ నోటిఫికేష‌న్‌తో పాటు ఇత‌ర‌త్రా స‌మాచారం కోసం www.telanganaset.orgwww.osmania.ac.in అనే వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించొచ్చు.

Leave A Reply

Your email address will not be published.