గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ ముట్టడి

-  మద్దతు తెలిపిన కాంగ్రెస్, తెలంగాణ జన సమితి.. తీవ్ర ఉద్రిక్తత..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్‌పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ తెలంగాణ జన సమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ దగ్గర వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్‌కి సమయం లేదని అభ్యర్థులు వాయిదా కోరుతున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డిఎల్ పరీక్షలు జరుతున్నాయి. గ్రూప్స్‌కి సమయం ఎక్కడ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెలలో టెట్ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పలు ఎగ్జామ్స్ పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.