ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

నీరు కరెంటు కష్టాలకు చెక్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గ్రామీణుల వెతలను అర్థం చేసుకున్న ఓ యువకుడు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. నీరు, కరెంటు కష్టాలకు చెక్‌పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మధు వజ్రకరూర్‌ అనే యువకుడు తాగునీరు, కరెంటును ఉత్పత్తి చేసే గాలిమర (విండ్‌ టర్బైన్‌)ను ఆవిష్కరించారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయనకు కొత్త ఆవిష్కరణలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ.పేదలు పడుతున్న తాగునీరు, కరెంటు కష్టాలను తీర్చాలని 16 ఏండ్లుగా కృషి చేస్తున్న ఆయన తాజాగా విజయవంతం అయ్యారు. 2020లో ఆయన అభివృద్ధి చేసిన గాలి మర 30 కిలో వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సుమారు 25 ఇండ్ల కరెంటు కష్టాలను తీరుస్తున్నది. అదే సమయంలో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. రోజూ 80-100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు దీని ద్వారా అందుతున్నది.

Leave A Reply

Your email address will not be published.