టర్కీలో మళ్లీ మరోసారి రెండు భారీ భూకంపాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అసలే భారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీలో మళ్లీ మరోసారి రెండు భారీ భూకంపాలు సంభవించాయి. సోమవారం రాత్రి టర్కీలోని హటే ప్రావిన్స్‌లోని అంటక్యాలో భూకంపం సంభవించిందితాజా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భారీ భూకంపంప్రభావం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 213 మందికి పైగా గాయపడ్డారని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లును చెప్పారు.గత పక్షం రోజుల క్రితం టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత భవనాల శిథిలాల కింద బాధితుల ప్రాణాలను రక్షించడానికి టర్కీ ప్రభుత్వం రెండు ప్రావిన్స్‌లలో పెద్ద రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉంది. మరో వైపు సోమవారం టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో మరో రెండు భూకంపాలు సంభవించాయని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. దక్షిణ టర్కీలో సోమవారం సంభవించిన రెండు తాజా భూకంపాలపై యునైటెడ్ స్టేట్స్ తీవ్ర ఆందోళన చెందుతోందని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ చెప్పారు. టర్కీకి పూర్తి మద్ధతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.