భారత్ కు మరో రెండు బంగారు పతకాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రెండు స్వర్ణం లభించింది. మహిళల టీమ్‌ కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్‌, అదితి గోపిచంద్‌, పర్ణీత్‌ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో చైనీస్‌ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కాగా స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఇండియ‌న్ జోడి పాల్ సంధు, దీపికా ప‌ల్లిక‌ల్ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్న‌ది. దీంతో భారత్‌ ఖాతాలో 82 పతకాలు చేరాయి. ఇందులో 19 స్వర్ణాలు, 31 కాంస్యాలు, 32 రజత పతకాలు ఉన్నాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఫైనల్‌లో ఓజాస్‌ డియోటల్‌, జ్యోతి సురేఖ జట స్వర్ణం సాధించింది. అదేవిధంగా సునీల్‌ కుమార్‌, గ్రెసొ జంట రజతం గెలుపొందింది.హోరాహోరీగా జ‌రిగిన‌ ఫైన‌ల్లో మలేషియా జంట అజ్మ‌న్‌, సైఫిక్ బిన్ క‌మ‌ల్‌ను ఓడించారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్‌లో.. ఇండియన్ జోడి సూప‌ర్ గేమ్‌ను ప్ర‌ద‌ర్శించింది. తొలి గేమ్‌లో 11-7 స్కోరుతో ప్ర‌త్య‌ర్థిపై దీపిక జోడి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఇక రెండ‌వ గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది.ఓ ద‌శ‌లో ఈజీగానే వెళ్తున్న‌ట్లు క‌నిపించినా.. మ‌లేషియా జోడీ చివ‌ర్లో జోరును పెంచింది. దీంతో రెండ‌వ గేమ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. 11-10 స్కోరు తేడాతో రెండ‌వ గేమ్‌ను గెలిచిన దీపిక జంట‌.. ఆసియా క్రీడ‌ల్లో చ‌రిత్ర సృష్టించింది. ఇండియా ఖాతాలోకి మ‌రో బంగార ప‌త‌కం వెళ్లింది. ఈ సారి క్రీడ‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు 20 గోల్డ్ మెడ‌ల్స్ ద‌క్కాయి.

 

నిరాశపరిచిన షట్లర్‌ పీవీ సింధు

 

ఇక షట్లర్‌ పీవీ సింధు నిరాశపరిచింది. బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో చైనాకు చెందిన హి బిన్‌జియావో చేతిలో 16-21, 12-21తో ఓడిపోయింది. బిన్‌జియావో విజృంభించడంతో మ్యాచ్‌ మొత్తం ఏకపక్షంగా సాగింది.

Leave A Reply

Your email address will not be published.