మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవం రోజు అర్ధరాత్రి మహిళను స్టేషన్‌‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన కేసులో రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై వేటు పడింది. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ… ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అసలేం జరిగిందంటే.. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటున్న వరలక్ష్మీ… తన కూతురి పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి డబ్బులు కోసం వెళ్లారు. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌కు వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్లో వరలక్ష్మిని పోలీసులు ఆపేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. బాధితురాలు ఎదురు తిరిగినందుకు ఖాకీలు మరింత చిత్రహింసలకు గురి చేశారు. ఆపై తెల్లవారుజామున ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్ పోలీసులు వదలిపెట్టారు. పోలీసులు దాడిలో బాధితురాలు నడవలేని స్థితికి చేరుకున్నారు. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.