నాటోలో చేరి తమను తాను కాపాడుకోదానికి ఉక్రెయిన్ ఎదురుచూపు

 

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు రష్యా అంటే అటు ఉక్రెయిన్ కు.. ఇటు నాటో దేశాలకు శత్రువుతో సమానం. అందుకే ఈ శత్రువులు ఇద్దరూ ఒక్కటి కావాలని చూస్తున్నారు. నాటోలో చేరి తమను తాము కాపాడుకోవడంతోపాటు రష్యాకు గట్టి హెచ్చరిక పంపాలని ఉక్రెయిన్ ఎదురుచూస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ మేరకు ప్రతిపాదనలను నాటోకు పంపారు.
ఉక్రెయిన్ లోని లుగాన్స్క్ డొనెట్స్క్ ఖెర్సోన్జపోరిజాయాలను రష్యా తాజాగా విలీనం చేసుకుంది. వీటిని రష్యాలో శాశ్వతంగా విలీనం చేసుకోవడానికి అక్కడ ఈ వారంలో రెఫరెండం నిర్వహించింది. రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు రెఫరెండంలో వెల్లడైందని రష్యా వర్గాలు ప్రకటించారు. సైనిక దళాలు ఎన్నికల అధికారులు ఐదు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు తెలిపారు. అనంతరం ఈ నాలుగు ప్రాంతాలను విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే జెలెన్ స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేసి నాటోలో చేర్చుకోవాలని సంప్రదింపులు చేపట్టారు.నాటో కూటమి ప్రమాణాలకు అనుగుణంగా తాము ఉన్నామని జెలెన్ స్కీ తెలిపారు. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో ఉక్రెయిన్ చర్చలు జరపదన్నారు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు జరుపుతామని వీడియోలో జెలెన్ స్కీ వివరించారు.2014లో ఉక్రెయిన్ లోని క్రిమియాను కూడా రష్యా ఇలాగే ఆక్రమించుకొని విలీనం చేసుకుంది. మళ్లీ ఏళ్ల తర్వాత తాజాగా నాలుగు ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధంతో ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోగా.. మిగిలిన కొద్దిమందితోనే ప్రజాభిప్రాయసేకరణను బలవంతంగా నిర్వహించి ఈ తంతు ముగించారు. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికి వచ్చి ఉక్రెయిన్ వాసులతో బలవంతంగా ఓట్లు వేయించారని పలువురు ఆరోపించారు.ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం దాదాపు అసాధ్యం. వీలినం తర్వాత ఈ నాలుగు ప్రాంతాలపై దాడిని రష్యాపై దాడిగా పరిగణిస్తామని.. అణ్వాయుధాలను ఉపయోగించడానికి సిద్ధమని పుతిన్ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ దాదాపుగా వదిలేసుకున్నట్టే.ఇక విలీనాన్ని గుర్తించమని పశ్చిమ దేశాల కూటమి జీఇప్పటికే స్పష్టం చేసింది. రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాము నాటోలో చేరుతామని.. తద్వారా రష్యాపై యూరప్ దేశాల సాయం కోసం ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. మరి దీనిపై నాటో దేశాలు ఏమంటాయిఉక్రెయిన్ ను చేర్చుకొని రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తాయాలేదాఅన్నది వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.