ముంచుకొస్తున్న ఆర్థిక మాధ్యం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని.. మాంద్యం ముంచుకొస్తోందని.. ప్రజలు అనవసర ఖర్చులకు దూరంగా ఉండి డబ్బు దాచుకోవాలని.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సూచించారు. ‘TV, ఫ్రిజ్, కారు కొనాలనే ఆలోచనలో ఉన్నా కాస్త దూరంగా ఉండండి. నగదును మీ వద్దే ఉంచుకోండి. కొనడానికి బదులు డబ్బు దాచుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాలి. అంతా మంచి జరగాలనుకుందాం. కష్ట కాలాన్ని కూడా తట్టుకునేందుకు సిద్ధమవుదాం’ అని బెజోస్ అన్నారు.