టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నమ్మలేని నిజాలు

- ఎంపీ బండిసంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నమ్మలేని నిజాలున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ఆరోపించారు. గ్రూప్‌-1లో బీఆర్ఎస్నేతల పిల్లలుబంధువులు క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారనిఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారనిదీనికి మంత్రి కేటీఆరేబాధ్యుడని బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. కేసీఆర్నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ఆయన ప్రశ్నించారు. నయీం డైరీసినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేననిత్వరలో కేటీఆర్ నిర్వాకాన్ని ప్రజల ముందు పెడతామని బండి సంజయ్‌ తెలిపారు.మరోవైపు ఈ కేసులో రెండవ రోజు పేపర్ లీక్ నిందితుల విచారణ ముగిసింది. మంది నిందితులను గంటల పాటు సైబర్ క్రైమ్ & సిట్ దర్యాప్తు బృందం విచారించింది. నిందితుల నుండి పలు కీలక విషయాలు రాబట్టింది. వాట్సప్ చాట్‌‌లో సరికొత్త లింకులు బయటపడ్డాయి. రాజశేఖర్ప్రవీణ్రేణుకలను విడివిడిగా విచారించారు. ముగ్గురు నిందితుల వాట్సప్ చాట్‌ని రిట్రీవ్ చేశారు. వాట్సప్ చాటింగ్ ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రాజశేఖర్ చాలామందికి పేపర్లను ఇచ్చినట్లుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్రాజశేఖర్‌ కలిసి కుట్ర పూరితంగా పేపర్‌ను లీక్ చేసినట్లుగా సిట్ తేల్చింది. రాజశేఖర్ప్రవీణ్‌ల వ్యక్తిగత కంప్యూటర్ నుంచి డాటాను అధికారులు రిట్రీవ్ చేశారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.గ్రూప్ వన్ పేపర్‌ను చాలామందికి సర్క్యులేట్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఐదు పేపర్ల సమాచారాన్ని అధికారులు వాట్సాప్‌లో గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.