బీజేపీ-జేడీ(ఎస్) మధ్య అవగాహన సిద్ధరామయ్య ఎద్దేవా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) మధ్య అవగాహన కుదరడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. జేడీఎస్‌ సెక్యులర్ భావజాలాన్ని నిలదీశారు. సెక్యులర్ అనే పదాన్ని కేవలం పేరులోని ఇముడ్చుకుందని, ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని, అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమేనని అన్నారు. జేడీఎస్ పార్టీ బీజేపీ ‘బీ-టీమ్’ అని పేర్కొన్నారు.”బీజేపీకి బీ-టీమ్ జేడీఎస్ అంటూ నేను చెబుతూనే ఉన్నాను. ఈరోజు అది రుజువైంది. నేను ఆ మాట అన్నప్పుడల్లా జేడీఎస్ నాపై విరుచుకుపడేది. జేడీఎస్ పేరులో సెక్యులర్ అని తగిలించుకుంది. కానీ మతతత్వ (కమ్యూనల్) పార్టీతో చేతులు కలిపింది” అని హుబ్బల్లిలో జరిగిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య అన్నారు. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ పదేపదే ఏ పార్టీతోనూ కలిసేసి లేదని చెబుతుంటారని, పార్టీ మనుగడ కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నట్టు జేడీఎస్ సమన్వయ కమిటీ చీఫ్ జీడీ దేవెగౌడనే స్వయంగా ప్రకటించారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.