సిఎస్,డిజిపి లతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎకె భల్లా వీడియో సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాల కల్పన అనగా రహదారులు, సెల్ టవర్ల నిర్మాణం, వివిధ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై శుక్రవారం ఢిల్లీ నుండి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సిఎస్,డిజిపిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి,పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాధ్  రెడ్డి,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, పిఆర్ అండ్ ఆర్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త,ఐటి శాఖ కార్యదర్శి కోన శశిధర్,గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతి లాల్ దండే,పిసిసిఎఫ్ ఎకె ఝూ,ఐజి ఇంటిలిజెన్స్(ఎస్బి) వినీత్ బ్రిజ్వాల్, ఐపిఎస్ అధికారి మీనా, పంచాయతీరాజ్ ఇఎన్సి పిబి నాయక్,ఆర్ అండ్బి ఇఎన్సి మాధవి సుకన్య,ఎస్పి ఇంటిలిజెన్స్ ఎస్ఐబి బాబ్జి, తదితర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.