వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా లోని వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో పర్యటించారు. గతంలో నిర్మల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మత్స్యపురి గ్రామంతో పాటు మరో ఆరు గ్రామాలకు మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు 2015లో రూ. 1.25 లక్షల నిధులను మంజూరు చేశారు. అప్పుడు మొదలు పెట్టిన పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటిస్తున్న ఆమె మత్స్యపురి గ్రామానికి వచ్చారు. ఈ పర్యటనలో మంచినీటి ఎద్దడిని పరిష్కరించాలని ఆమెను గ్రామస్తులు కోరారు. స్థానికులు నీటి సమస్యను లేవనెత్తడంతో నిర్మాలా సీతారామన్ అవాక్కయ్యారు.నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు 2015లోనే నిధులు మంజూరు చేశామని ఎందుకు సమస్యను పరిష్కరించలేదని అధికారులను పశ్నించారు. మీ ఎమ్మెల్యేను గట్టిగా అడగాలని ప్రజలకు సూచించారు. కేంద్రమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మత్స్యపురి పర్యటించారు. గ్రామస్తుల ఎదుటే ఎమ్మెల్యేను మంత్రి బుగ్గనను నిలదీశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి ఎద్దడిని పరిష్కరించాలని నిధులు మంజూరు చేశామని ఇప్పటివరకు పనులు ఎందుకు పూర్తి చేయలేదని మంత్రితో పాటు అధికారులను ప్రశ్నించారు. ఏడు ఏళ్ల క్రితం నిధులను మంజూరు చేస్తే ఇప్పటివరకు పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఎమ్మెల్యేను నిర్మాలా సీతారామన్ నిలదీశారు.నిర్మలా సీతారామన్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి కాకినాడ చేరుకుని శుక్రవారం ఐ‌ఐ‌ఎఫ్‌టి ప్రాంగణాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ప్రారంభిస్తారు. తర్వాత విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రి‌తో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Leave A Reply

Your email address will not be published.