పకడ్భందీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పకడ్భందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా నమోదు ప్రక్రియ విచారణ జరుగుతున్న తీరుతో పాటు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 19న విచారణ డ్రాఫ్టులు, 23 తేదీ వరకు ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామని అనంతరం డిసెంబర్ 9వ తేదీన ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే క్లయిమ్ చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం డిసెంబరు 25న ఓటర్ల జాబితాను డిస్పోజల్ చేయడంతో పాటు డిసెంబరు 30వ తేదీన చివరి జాబితాను విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాలకు మొత్తం 19 మంది రెవెన్యూ డివిజన్ అధికారులు (ఆర్డీవో)లను ఏఈఆర్వోలుగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు వారు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలను అప్పగించామని వికాస్రాజ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.