రాష్ట్రపతి పదవిని తిరస్కరించిన వాజ్‌పేయి     

ప్రధాని పదవికి మిస్సయిన అద్వానీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రపతి పదవిని చేపట్టాలని అత్యంత సన్నిహితులు ఇచ్చిన సలహాను మాజీ ప్రధాన మంత్రి, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి తిరస్కరించారని ఆయన వద్ద మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్‌ టాండన్‌ తెలిపారు. టాండన్‌ రాసిన పుస్తకం ‘ది రివర్స్‌ స్వింగ్‌ కలోనియలిజం టు కోఆపరేషన్‌’లో ఈ వివరాలను వెల్లడించారు. 1998-2004 మధ్య కాలంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నపుడు, 2002లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయని, అద్వానీకి ప్రధాని పదవిని ఇచ్చేసి, రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలని వాజ్‌పేయి సన్నిహితులు ఆయనకు సలహా ఇచ్చారని తెలిపారు. ఎలక్టొరల్‌ కాలేజీలో మెజారిటీతో ప్రస్తుత ప్రధాన మంత్రి రాష్ట్రపతి కావడం ప్రజాస్వామిక దేశానికి శుభసూచకం కాదని చెప్పారని తెలిపారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా సిఫారసు చేసినవారు వాజ్‌పేయి అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.