తెలంగాణలో అందుబాటు పాఠశాలల కలల్ని  నిజం  చేసిన ‘వర్ధనా’

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విద్య లాభదాయకమైన పరిశ్రమగా మారిన కాలంలో, తమ విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడానికి,  మం చి భవిష్యత్తుకు బాటలు వేయడానికి తమ ప్రభావాన్ని ఉపయోగించే కొన్ని పాఠశాలలు ఇప్పటికీ ఉన్నాయి. ధనవంతులకు విద్యా ఎంపికలు పుష్కలంగా ఉన్నప్పటికీ, మధ్యతరగతి, దిగువ-ఆదాయ వర్గాలకు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటోంది. జనాభాలోని ఈ సమూహాల పిల్లలకు, మెరుగైన భవిష్యత్తుకు విద్య అనేది ఏకైక ద్వారం.అనేక పాఠశాలలు మధ్యతరగతి, దిగువ-ఆదాయ వర్గాల విద్యా ర్థుల జీవితాల్లో ప్రాథమిక మార్పులను తీసుకురావాలనే లక్ష్యంతో స్థాపించబడినప్పటికీ, అవి అనేక సవా ళ్లను ఎదుర్కొంటున్నాయి. యజమానులు ఆర్థిక పరిమితులు, సిబ్బంది కొరత, విద్య పట్ల లింగ-ఆధారిత విముఖ త, బోధన నాణ్యత ఆందోళనలు, ఉపాధి రంగంలోకి ప్రవేశించడానికి విద్యార్థుల డ్రాపవుట్‌లు, సాంకేతిక పరిమి తులు, సరిపోని మౌలిక సదుపాయాల సమస్యలను అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటుంటారు. కొవిడ్ మహ మ్మారి ఆవిర్భావం ఈ సమస్యలకు ఓ తోడుగా మారింది. అటువంటి పాఠశాలలకు సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ, పాఠ శాలల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతుకుతున్నాయని తరచుగా నిరూపించబడింది.నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) వర్ధనా రాకతో పరిస్థితిలో మార్పు వచ్చింది.  ఇది మౌలిక సదు పాయాలు, ఇతర సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రైవేట్ అందుబాటు పాఠశాలలకు రుణాలు అందించడంలో ప్రత్యే కత కలిగి ఉంది. దీని క్లయింట్ బేస్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమి టంటే, వాటి ఎదుగుదల ప్రయాణంలో వర్ధనా వారికి సహాయం చేసిన విధానాన్ని చెప్పడానికి వారందరికీ ఒక కథ ఉంది.హైదరాబాద్‌లోని న్యూ సెయింట్ మరియా హైస్కూల్ ఓనర్ శ్రీమతి ఝాన్సీ రాణి వర్ధనా ప్రభావం గురించి మాట్లాడుతూ, “మా విస్తరణ ప్రణాళికలలో భాగంగా, మేం ఒక స్థలాన్ని కొనుగోలు చేశాం. మేం అందించే విద్యను మెరుగుపరచడానికి   మేం వర్ధనా నుండి క్యాన్ డిజిటల్ సొల్యూషన్స్‌ ని ఎంచుకున్నాం. వారి అన్‌లాక్ బ్రిడ్జ్ కంటెంట్ పుస్తకాలు మా విద్యార్థులు వారి ప్రస్తుత విద్యా స్థాయిలకు అనుగుణంగా ప్రాథమిక సంఖ్యా, అక్షరాస్యత నైపుణ్యాలను సాధించడంలో సహాయపడటానికి కీలకంగా నిలిచాయి. పాఠశాల వెబినార్లను నిర్వహించడం లో, మా ఉపాధ్యాయులు,  పాఠశాల సారథులకు తాజా విద్యాపరమైన మార్పుల గురించి అవగాహన కల్పించ డంలో చురుకైన ప్రయత్నాలకు సంబంధించి వర్ధనా ఫైనాన్స్‌ కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజే స్తున్నాం. అకడెమిక్ ఎక్స్లెన్స్‌ ను ప్రోత్సహించడంలో వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం, ఈ వెబినార్లను మా అధ్యాపకులకు అవగాహన కల్పించడం, సాధికారత ఇవ్వడంలో అమూల్యమైనవి” అని తెలిపారు.వర్ధనా ప్రభావం 15 రాష్ట్రాలలో విస్తరించింది, 9,000కు పైగా అందుబాటు ప్రైవేట్ పాఠశాలలకు ప్రయోజనం చేకూర్చింది. దేశవ్యాప్తంగా నాలుగు మిలియన్ల విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఒక్క తెలంగాణలోనే, వర్ధనా 565 కంటే ఎక్కువ పాఠశాలలకు సహాయం చేసింది, రాష్ట్రానికి విశేషమైన రీతిలో 158 కోట్లను అందించింది. పాఠశాలలు, విద్యార్థుల పట్ల వర్ధనా నిబద్ధత దానిని ఈ రంగంలో ఇతర సంస్థల నుండి వేరు చేస్తుంది. ఇది ప్రతి దశలో పాఠశాలలతో సహకరిస్తుంది, ఉపాధ్యాయుల నైపుణ్యం, యాజమాన్య నిర్వహణ శిక్షణ, సాంకేతిక మద్ద తును అందిస్తుంది. వివిధ కోర్సులు, నైపుణ్య -అభివృద్ధి కోర్సులను అభ్యసించడానికి విద్యార్థులకు విద్యా రుణాలను కూడా అందిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.