హిందు దేవి దేవతల జోలికి వస్తె ఖబర్ధార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ ప్రతినిధి: సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని శ్లోకం పై రెంజర్ల రాజేష్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఇంఛార్జి ఎస్సై సీత రామమ్మకు బాసర మహా పాదయాత్ర భక్త బృందం మంగళవారం రోజున కామారెడ్డి జిల్లా బీర్కుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలానికి చెందిన నాస్తికుడు రెంజర్ల రాజేష్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని శ్లోకన్ని కించ పరుస్తూ సరస్వతి కామ ఐటమ్ అంటూ, హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ బంధువుల మనో భావాలు దెబ్బ తీసేలా మాట్లాడడం జరిగింది.కావున రాజేష్ ను 24గంటల లోపల అరెస్ట్ చేసి ఆయనపై పిడి యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో బాసర పాదయాత్ర భక్త బృందం పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం గాంధిచౌక్ కూడలిలో హిందూ దేవి దేవతల జోలికి వస్తె ఖబర్ధర్ అంటూ రెంజర్ల రాజేష్ రాజేష్ దిష్టి బొమ్మ దహన చేశారు.
ఈ కార్యక్రమంలో సుధాకర్ యాదవ్ గురుస్వామి, డాక్టర్ బాల కృష్ణ గురుస్వామి, గుడికొండ బాలకృష్ణ గురుస్వామి, మందబాధ రాజేందర్, పెండ్యాల శ్రీకాంత్, బండ సాయిలు, నాగెళ్ళ సాయి కిరణ్, పోచుగోండ, అరిగె నరేష్, గువ్వ ప్రశాంత్, యమ చిన్న రాములు, క్రిష్ణరెడ్డి, గోసం బాలాజీ, వడ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.