వీకర్స్ కాలనీకి కరెంట్ వచ్చింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/
గాంధారి : ఎన్నో సంవత్సరాలుగా చీకట్లో ఉన్న వీకర్స్ కాలనీకి ఎట్టకేలకు కరెంట్ వెలుగులు వచ్చాయి. గాంధారి మండల కేంద్రంలోని బుడగ జంగాల (వీకర్స్ )కాలనీలో బుధవారం విద్యుత్ సరఫరాను స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ ప్రారంభించారు. గత 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో సుమారు 40 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి. అయితే కాలనీ ఏర్పడిన నాటి నుండి అక్కడి ప్రజలు విద్యుత్ లేక చాలా ఇబ్బంది పడి చీకట్లో ఉంటున్నారు. ఎన్నో సార్లు అధికారులకు, నాయకులకు విన్నవించినా లాభం లేకపోయింది. ఈ విషయమై కాలనీ ప్రజలు స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ కు తమ గోడును వివరించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ దృష్టికి తీసుకోని వెళ్లారు. స్వయంగా చొరవ తీసుకోని ఎమ్మెల్యే ద్వారా విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యుత్ లైన్ ఏర్పాటును మంజూరు చేయించారు. దింతో గత నేల క్రితం ప్రారంభం అయినా విద్యుత్ లైన్, స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేశారు. సుమారు 13 విద్యుత్ స్తంభాల ద్వారా వీకర్స్ కాలనీకి కరెంటు సరఫరా ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ బుడగ జంగాల కాలనీ కి విద్యుత్ సరఫరా చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే సురేందర్, జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధా బలరాం నాయక్ గారికి కాలనీ వాసుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలనీ కి ఇప్పటి వరకు ఎవ్వరు చేయని పనిని స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్ కృషి చేసినందుకు కాలనీ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, మాజీ చైర్మన్ సత్యం, ఉప సర్పంచ్ రమేష్, వీడీసీ చైర్మన్ మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.