ఆది లీల ఫౌండేషన్ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయ దేవి

తెలంగాణ జ్యోతి, వెబ్ న్యూస్/

ఆది లీల ఫౌండేషన్ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయ దేవి నియమితులైనారు. ఈ మేరకు ఆది లీల ఫౌండేషన్ హైదరాబాదు కార్యాలయం లో ఆదిలీల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆదినారాయణ, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి లీలావతి ఆమెకు నియామక పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు. విజయ దేవి ప్రముఖ సంఘ సేవకురాలు, బిజెపి నాయకులు  మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ కృష్ణంరాజు సమీప బంధువు.ఈ సందర్బంగా ఆదినారాయణ మాట్లాడుతూ మంచి కుటుంబం నుంచి వచ్చిన విజయ దేవి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ  ప్రజలకు సేవలు అందిస్తున్న తరుణంలో ఆది లీల ఫౌండేషన్ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం హర్షనీయమన్నారు. మానవసేవే మాధవసేవ అనే లక్ష్యంతో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఆది లీలా ఫౌండేషన్ సాంఘిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పర్చే దిశగా ముందు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విజాయదేవి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఆది లీల ఫౌండేషన్ తనకు అప్పజెప్పిన బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపారు.ముందు ముందు వారు చేపట్టే కార్యక్రమాలకు తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాతృదేవోభవ సంస్థ అధ్యక్షులు కేబీ శ్రీధర్బిజెపి యువ మోర్చా నాయకుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.