ఆగస్టు 5న  వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ ఎన్నికలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య  సమావేశము 5 ఆగస్టు 2023 శనివారం ఉదయం 10 గంటలకు  సద్గురు సాయిరాం హాస్పటల్ వద్ద గల ప్రాంగణమునందు ,  ఆలీ బాగ్, వికారాబాద్ నందు ఏర్పాటు చేయడమైనది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు జిల్లా కలెక్టర్ లింగ్యా నాయక్ అధ్యక్షతన, సహాయకులుగా జిల్లా సహకార అధికారి శంకరాచారి మరియు జిల్లా సహకార కార్యాలయము  సీనియర్ ఇన్స్పెక్టర్ అజ్మత్ పాష సమావేశంలో పాల్గొంటారని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ భక్తవత్సలం తెలియజేయుచున్నారు.       ఈ సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ తదుపరి వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్  సొసైటీలో నమోదు కాబడిన 574 మంది సభ్యులు ఉన్నారని,  వారిలో నుండి (10) మందిని నూతన మేనేజింగ్ కమిటీ సభ్యులు గా ఎన్నుకొంటారని, కావున వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో నమోదు కాబడిన సభ్యులు మాత్రమే సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ భక్తవత్సలం ఒక ప్రకటనలో తెలియజేసినారు.

Leave A Reply

Your email address will not be published.