తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన లూనార్ రికన్నై’సెన్స్’ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌కు .. చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చిక్కింది. విక్రమ్‌ను ఆ ఆర్బిటార్ ఫోటో తీసింది. ఆ ఫోటోలను నాసా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆగస్టు 23వ తేదీన దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ దిగినట్లు నాసా పేర్కొన్నది. అయితే ఆగస్టు 27వ తేదీన నాసాకు చెందిన ఎల్ఆర్వో ఈ ఫోటోను తీసింది. ల్యాండింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ ఫోటో తీశారు. విక్రమ్ ల్యాండర్‌ను 42 డిగ్రీల కోణంలో ఎల్ఆర్వో కెమెరా ఫోటో తీసినట్లు నాసా వెల్లడించింది. అయితే ఆ ల్యాండర్ నుంచి వెలుబడిన వాయువులు, అక్కడి నేలతో ఇంటరాక్ట్ కావడం వల్ల విక్రమ్ చుట్టూ ఆ బ్రైట్ వెలుతురు కనిపించినట్లు నాసా తెలిపింది.మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ నుంచి ఎల్ఆర్వో కెమెరాలను నాసా మేనేజ్ చేస్తోంది. మరో వైపు ఇస్రో మంగళవారం చంద్రుడికి చెందిన 3డీ ఇమేజ్ను రిలీజ్ చేసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.