మత్స్యకార వృత్తి పై బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు వెనక్కు తెసుకోవాలి

- తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు పగిడాల సుధాకర్ ముదిరాజ్ డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తరతరాలుగా కొనసాగుతున్న మత్స్యకారుల వృత్తిని ఇతర కులాలకు తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడు బట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడడాన్ని  తెలంగాణ ముదిరాజ్ మహాసభ తీవ్రంగా ఖందించింది. కులవృత్తుల పైన ఆయనకు అవగాహన కలిగి ఉన్నప్పటికిని ఉద్దేశపూర్వకంగా మత్స్యకారుల వృత్తిని వేరే కులాలకు కట్టబెట్టాల  విక్రమార్క లాంటి నాయకునికి తగదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు,బి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి  పగిడాల సుధాకర్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఆయన ఆ ప్రకటనను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేసారు..లేకుంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా బట్టి విక్రమార్కను మత్స్యకారులు నిలదీయాలని పగిడాల సుధాకర్ పిలుపు నిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ బెస్త కులలకు తప్ప చేపల వేటలో ఇతర కులాలకు అవకాశం లేదని జీవోలు ఉన్నప్పటికీ మత్స్యకారుల పైన కక్ష కట్టడం  ఇతర కులాలకు తాకట్టు పెట్టాలనుకోవడం ఒక ప్రదాన రాజకీయ పార్టీగా నేతకు తగదన్నారు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఎక్కడకక్కడ తిప్పి కొట్టాలని పగిడాల సుధాకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.