అంబరాన్నంటిన వినాయక సామూహిక నిమజ్జనోత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వినాయక సామూహిక నిమజ్జనోత్సవం జియాగూడ, పురానాపూల్ పరిసర ప్రాంతాలలో అంగరంగ వైభవంగా కొనసాగింది. భారీ వర్షంలోనూ వినాయక ఊరేగింపులను శోభాయమానంగా “నిర్వహించారు. జియాగూడ అరెకటిక మోండేదార్ల సంఘం, నర్సింగ్ డెకరేషన్ హౌజ్ల సంయుక్తాధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడిని పల్లకిలో తీసుకుని పాదయాత్రగా వినాయకసాగర్కు తరలించారు. జియాగూడ ఇందిరానగర్ ఆదిజాంబవ సంక్షేమ సంఘం వారు ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను వేలం వేయగా రూ.51వేలకు కొంకి దాసు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కొంకి దాసుకు ఉత్సవ నిర్వాహకులు టి.యాదయ్య, ఎమ్. రఘునాధ్, ఎమ్ కిషన్, ఎమ్ బాలకృష్ణ, జి చెన్నయ్య, పాలెం వెంకటేశ్, బర్ల యాదయ్య, ఎమ్. వెంకటేశ్, పల్ల ప్రేమకుమార్, సంఘం అధ్యక్షుడు కేశవ్, ప్రధానకార్యదర్శి సురేష్ కోశాధికారి శివకుమార్, సంతోష్ టైసన్ రాజు, ఎమ్ విక్కీ తదితరులు కలిసి కొంకి దాసుకు వినాయకుడి లడ్డూను అందజేసి ఘనంగా సన్మానించారు. జియాగూడ రోడ్లలో పురానాపూల్ చౌరస్తాలో…ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు దివంగత కుందన్లాల్ జైస్వాల్ పరివార సభ్యులు గత 75 సంవత్సరాలుగా ఒకే వేదికైన పురానాపూల్ చౌరస్తాలో స్వాగత వేదిక ఏర్పాటుచేసి వినాయక ఊరేగింపులకు స్వాగతం పలుకడమే కాకుండా ఉత్సవ నిర్వాహకులను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్మానించారు. జియాగూడ భీమ్నగర్ చౌరస్తాలో జియాగూడ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ నిర్వాహకులను, ఉత్సవాల్లో సేవలందించిన అధికారులు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. సబ్బంపరా పోలీస్ ఇన్స్పెక్టర్ టి.అశోకుమార్కు జ్ఞాపిక అందజేసి సన్మానించారు. సీఐటీయూ, ఐద్వా శాంతి సంఘీటిన వేదిక, భాధాస, భాజపా తదితర పార్టీల ఆధ్వర్యంలో కూడా వేర్వేరుగా స్వాగత వేదికలు, ప్రసాదాల వితరణ వేదికలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించడంలో గోషామహల్ డివిజన్ అధ్వర్యంలో కల్సుంపునా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.