మహిళలకు అనువైన నగరంగా విశాఖపట్టనానికి అరుదైన రికార్డు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళలకు అనువైన నగరంగా విశాఖపట్నం అరుదైన రికార్డు దక్కించుకుంది. అవతార్ గ్రూప్ మహిళలకు అనువైన నగరాలే తెలుసుకోవడానికి దేశంలో 111 పట్టణాలు నగరాల్లో అధ్యయనం జరిపింది. అవతార్ గ్రూప్ అధ్యయనం ప్రకారం ఒక మిలియన్ (పది లక్షలు) జనాభా కంటే ఎక్కువ ఉన్న పది నగరాల్లో మహిళలకు అనువైన నగరంగా విశాఖ కూడా చోటు దక్కించుకుంది. దేశంలోనే టాప్ ఏడో నగరంగా రికార్డు సాధించింది. టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇండియా పేరుతో అవతార్ గ్రూప్ ఈ స్టడీ నిర్వహించింది. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళలు రాణించడానికి దేశంలో అనువుగా నగరాలేవో ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. ఇందుకు 200కు పైగా అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.ఒక మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను కేటగిరీ –1గా ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను కేటగిరీ–2గా విభజించారు. ఈ క్రమంలో విశాఖపట్నం మహిళలకు అనువైన టాప్–10 నగరాల్లో ఒకటిగా కేటగిరీ–1లో స్థానం సంపాదించింది.ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని నగరాలే మహిళలకు అనువుగా ఉన్నాయని అధ్యయనం తేల్చింది. దేశంలో చెన్నై పుణే బెంగళూరు హైదరాబాద్ ముంబై మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీకి టాప్ టెన్లో చోటు దక్కలేదు. ఢిల్లీ మహిళలకు అనువైన నగరాల్లో 14వ స్థానంలో నిలిచింది. టాప్ టెన్లో తమిళనాడులోని మూడు నగరాలకు చోటు దక్కడం విశేషం.. చెన్నై (ఒకటో స్థానం) కోయంబత్తూరు (9వ స్థానం) మధురై (10వ స్థానం) దక్కాయి.మొత్తం 111 పట్టణాల్లో మాత్రమే 50 కంటే ఎక్కువ స్కోర్ సాధించాయి. చాలా రాష్ట్రాల రాజధాని నగరాలు టాప్ 25లోకి కూడా రాకపోవడం గమనార్హం.అవతార్ గ్రూప్ స్టడీ ప్రకారం.. చెన్నై పూణే బెంగళూరు హైదరాబాద్ ముంబై అహ్మదాబాద్ విశాఖపట్నం కోల్కతా కోయంబత్తూర్ మదురై కేటగిరీ–1లో మొదటి 10 నగరాలుగా నిలిచాయి.తిరుచిరాపల్లి వెల్లూరు ఈరోడ్ సేలం తిరుపూర్ పుదుచ్చేరి సిమ్లా మంగళూరు తిరువనంతపురం బెలగావి కేటగిరీ 2లో టాప్ టెన్ నగరాలుగా చోటు దక్కించుకున్నాయి. ఈ నగరాల్లో ఒక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉంది.దేశంలో ఉత్తర ప్రాంతంలో మహిళలకు అనువైన మొదటి మూడు నగరాలుగా ఢిల్లీ శ్రీనగర్ అమృతసర్ నిలిచాయి. దక్షిణ ప్రాంతంలో చెన్నై బెంగళూరు హైదరాబాద్లు మొదటి మూడు స్థానాల్లో చోటు సాధించాయి. ఇక తూర్పు ప్రాంతంలో కోల్కతా అగ్రస్థానంలో ఉండగా ధన్బాద్ పాట్నా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో పుణె ముంబయి అహ్మదాబాద్లు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి.సెంట్రల్ రీజియన్లో రాయ్పూర్ ఇండోర్ భోపాల్ వరుసగా మొదటి రెండవ మూడవ స్థానాలను పొందాయి.

Leave A Reply

Your email address will not be published.