అయ్యాల సంతోష్ కు విశిష్ట సేవరత్న అవార్డు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: 

ఈరోజు 25-012-2022 ఆదివారం రోజున హైదరాబాద్ LB నగర్ చిత్ర కాంప్లెక్ హాల్ లో సామాజిక రంగాలలో సేవలను అందిస్తున్న సామాజిక కార్యకర్తలకు అవార్డులను ప్రజ్ఞ భారతి ఫౌండేషన్ మరియు శివకామాక్షి శ్రీ విద్యా పీఠం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని బోర్లమ్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాద్యాయునిగా పని చేస్తున్న దేశాయిపేట్ గ్రామానికి చెందిన అయ్యల సంతోష్
విశిష్ట సేవ రత్న అవార్డును, సామాజిక వేత్త మార్గం రాజేష్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అయ్యల సంతోష్ మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని, మున్ముందు మరెన్నో సామాజికoగా మరెన్నో కార్యక్రమాలు ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ ప్రొఫెసర్ విజయలక్ష్మి, సామాజికవేత్త , బంగారెడ్డి బహుదూర్, డాక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.