జనవరి 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. వైకుంఠ ద్వార విషయంలో గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌ లో రోజుకు 50వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందనిదర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభించి 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశామని త్వరలో మొదటి దశ టెండర్లను పిలుస్తామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.