తెలంగాణ లోను వివేకానందరెడ్డికి న్యాయం జరుగదు

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసినా అక్కడ కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిఅభిప్రాయపడ్డారు. వివేకా కేసు బదిలీపై ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్-జగన్.. ఇద్దరూ ఒకటే కాబట్టి తెలంగాణలో కూడా న్యాయం జరుగుతుందాఅన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘‘వివేకానందరెడ్డిని గుండెలో పోటు పొడిచి గుండెపోటుగా మార్చారు. ఆలస్యంగా వచ్చిన జగన్ ఆ రోజు కట్టుకథలతో రక్తి కట్టించారు. ఆనాడు చంద్రబాబు వేసిన సిట్‌పై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ కావాలని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడెందుకు ఆ డిమాండ్ చేయడం లేదు. పక్కా ప్రణాళికతో వివేకానంద రెడ్డిని హత్య చేసి కట్టుకథలు అల్లారు. జగన్ మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేయడమే కాదు.. రాజకీయాల నుంచి తప్పుకోవాలి. 175 తప్పులు చేసినందుకా వైసీపీకి 175 సీట్లు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలి. హత్యలు చేసినందుకాఅవినీతి చేసినందుకాఅమరావతిలో అగ్గి పెట్టినందుకా?.’’ అంటూ జగన్ సర్కార్‌ను ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.