వైసీపీ ని వెంటాడుతోంది వివేకానందరెడ్డి హత్య కేసు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైసీపీ ని వెంటాడుతోంది. సీబీఐ దూకుడు ఆ పార్టీ నేతల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌లోని నేతలకు కంటిమీద కునుకు లేకుండా చెస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైసీపీకి బాగా కలిసొచ్చింది. బాబాయి హత్యను కూడా అబ్బాయిలు తమ రాజకీయాలకు వాడుకున్నారు. మొదట ఆత్మహత్య అన్నారు. ఆ తర్వాత బాబాయిది గుండెపోటు కాదని, గొడ్డలి పోటని బయటకు రాగానే చంద్రబాబుతోపాటు కడపలోని టీడీపీ నేతలపై నిందలు వెయ్యడానికి పక్కా స్కెచ్ అమలు చేశారు. నారాసుర రక్తచరిత్ర అని పెద్ద కథ రాసి సాక్షి మీడియాలో ప్రచురించారు. చంద్రబాబు చేతిలో వేటకత్తిని గ్రాఫిక్స్ ద్వారా పెట్టారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని గవర్నర్‌ను కలిశారు. ఆ తర్వాత సీబీఐ విచారణ కావాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్ని చంద్రబాబు హయాంలో జరిగాయని, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను వైసీపీ ఉపసంహరించుకుంది. వైఎస్ సునీత పిటిషన్‌ను మాత్రమే హైకోర్టు విచారించింది. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణ ప్రారంభమయ్యాక.. కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. అతని స్టేట్ మెంట్ ఆధారంగా తీగలాగితే డొంక కదలడం ప్రారంభమైంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. ఆ ఇద్దరిని రెండు సార్లు విచారించింది. ఇది వైసీపీలో కలవరింతకు కారణమవుతోంది.గూగుల్ టేక్ ఔట్ ఆధారంగా సీఎం పీఎస్ కృష్ణమోహన్, వైఎస్ భారతి సహాయకుడు నవీన్ సీబీఐ విచారణకు పిలిచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. దీంతో సీబీఐ వ్యూహంపై వైసీపీ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కేసును మళ్లించేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య, రెండో బిడ్డ ఆస్తి తగాదాలంటూ ప్రారంభించారు. ఆ దిశగా ప్రశ్నించాలంటున్నారు. అయితే సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత బొండా ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దొరిగిన దొంగలు త్వరలో జైలు పోవడం ఖాయమన్నారు. గత ఎన్నికలకు ముందు చాలా డ్రామాలు జరిగాయి. కోడికత్తి, పింక్ డైమండ్, డేటా చోరీతోపాటు వివేకా కేసు అటువంటిదే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కుటుంబం మొత్తం ప్రదర్శించిన నటనానైపుణ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజాలను సీబీఐ కళ్ల ముందు పెడుతోంది. ప్రజలు ఎంత తప్పు చేశారో స్పష్టంగా సీబీఐ విశదికరిస్తోంది. గత నాలుగేళ్లుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. కానీ అసలు పశ్చాత్తాపమే లేకుండా తాము చేసిన నేరాలను ఇతరులపై నెట్టి అయినా సరే తాము అనుకున్న రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇలాంటి మేకవన్నే క్రూరమృగాలను ప్రజలు శిక్షించాలి. ప్రజలు వేసిన శిక్ష అత్యంత బలమైనది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసినట్టే.. పాలు పోశాము కదా.. మనల్నీ కరవదని అనుకుంటే కాటేసిన తర్వాత చింతించాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.