ఏపీ ప్రజలకు హెచ్చరిక

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది. మొన్నటి వరకు వర్షాలతో ఉపశమనం పొందిన జనాలు.. ఇప్పుడు ఎండలు, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం 45 డిగ్రీల వరకు చేరాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వడగాలుల తీవ్రత కూడా పెరగడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు.ఇవాళ 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ. సోమవారం కూడా పలు జిల్లాల్లో 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C ల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో 44.7.. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని, రావిపాడుల్లో 44.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అలాగే పలు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అంతేకాదు మంగళవారం 92 మండలాల్లో వడగాలులు, 190 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయి అంటున్నారు. ఈ ఎండలు, వేడిగాలుల దెబ్బకు చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు.మోచా తుఫాన్ ప్రభావంవల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం నుంచి ఏపీకి వీచే గాలులను తుఫాన్ లాగేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయిందంటున్నారు. తేమలేని పొడిగాలుల ప్రభావంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోందట. మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉంటుందంటున్నారు.మరోవైపు మోచా తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్‌ల మధ్య తీరాన్ని దాటింది. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. ఈ ప్రభావంతో బలమైన ఈదురుగాలు వీచాయి. ఇప్పటికే మయన్మార్‌ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.. ముందస్తు జాగ్రత్తగా దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైన చోట సహాయక చర్యల్ని చేపట్టారు. భారీగా నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ మోచా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని భయపడ్డారు.. కానీ వాతావరణశాఖ ముప్పు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఈ ప్రభావంతో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు పడ్డాయి

Leave A Reply

Your email address will not be published.