దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం వృథాచే స్తోందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాలను నిరసిస్తూ నల్ల కండువాలతో విద్యానగర్ చౌరస్తాలో  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లా డుతూ..ఐదువేల కోట్ల పెండింగ్ ఫీజు రియిం బర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండాదశాబ్ది ఉత్సవాల అన్న పేరుతో ప్రజాధనాన్ని వృథా చే యడం ఎంతవరకు సమంజసమన్నారు. సకాలంలో ఫీజు రియింబర్స్మెంట్ అమలు చేయక యాజమా న్యాలు సర్టిఫికెట్హాల్ టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ ఐఐ.టీ – ఐ.ఐ.ఎం – ఎన్.ఐ.టి తదితర కాలేజీ కోర్సులు చదివే బి.సి. విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని,  పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బిసి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని,.  ఈ సంవత్సరంలో అదనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కు ఒకటి చొప్పున 199 బి.సి గురుకుల పాటశాలలు మంజూరు చేయాలని,.  ఫీజు నియంత్రణ చట్టం అమలుపరచాలని,.  గురుకులాలలో ధరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా విద్యను అందించాలని,  ధరఖాస్తు చేసుకొన్న ప్రతి విద్యార్థికి విదేశీ విద్యా నిధులు మంజూరు చేయాలని,  రాష్ట్రంలో కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటికి స్వంత భవనాలు నిర్మించాలని,  పాత కలెక్టర్ భవనాలను కాలేజీ హాస్టల్ లకు కేటాయించాలని,బి.సి స్టడీ సర్కిల్ కు 200 కోట్లు కేటాయించాలి. కోచింగ్ పద్దతులు మార్చాలని,.అర్హులందరికీ DSC, గ్రూప్-1,2,3,4 సివిల్స్బ్యాంకింగ్రైల్వే ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.నిరసన కార్యక్రమంలో అనంతయ్యగడ్డం నరసింహశంకుయాదవ్ఈశ్వర్ప్రదీప్నిరంజన్వంశీకిరణ్జనార్ద న్కరుణాకర్వేణు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.