రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలను ప్రశ్నించే తత్వంతో ముందుకు కొనసాగాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 74వ  గణతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకొని  సదాశివపేట పట్టణ ఆర్టీసీ  కార్మికులు  గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి  స్వాతంత్ర సమరయోధుడు మునిపల్లి రామచందర్, స్వాతంత్ర సమరయోధుల వారసులను,  మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్  గారిని ముఖ్య అతిథులుగా  హాజరైనారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్  మాట్లాడుతూ  జనవరి 26వ  తేదీని  గణతంత్ర దినోత్సవ పండగ  గా  అది మన బ్రతుకులు మార్చే పండగ అని  కొనియాడారు.  ఈ గణతంత్ర దినోత్సవంను  ప్రతి ఒక్క భారతీయ పౌరుడు  పరిపూర్ణంగా తెలుసుకొని  రాజ్యాంగంలో కొనసాగుతున్నటువంటి నాలుగు వ్యవస్థలను  దృష్టిలో ఉంచుకొని  ప్రశ్నించే తత్వంతో  ముందుకు కొనసాగాలని పిలుపు నిచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన  ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ నాలుగు వ్యవస్థలను  కాపాడగలిగినప్పుడే  రాష్ట్రాలు  మరియు దేశం  అభివృద్ధి పథంలో ముందుంటుందని  తెలియజేశారు.  ఈ యొక్క కార్యక్రమంలో  స్వాతంత్ర సమరయోధుల వారసులు  జిల్లా అధ్యక్షులు  మునిపల్లి రమేష్ గారు,  ప్రధాన కార్యదర్శి కూచిని సతీష్,  మరియు  ఆర్టీసీ కార్మికులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.