ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు సహకారం అందిస్తాం

: ప్రధాని మోడీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం నుంచి చర్చలు, దౌత్యం ద్వారా వివాద పరిష్కారానికి భారత్ ప్రాధాన్యనిస్తోందని, ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు మేం చేయగలిగిన సహకారం అందిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు స్ఫూర్తిని కొనసాగిస్తామని మోదీ అన్నారు.మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలలో యుద్ధం పరిణామాలను తగ్గించేందుకు మరింత కృషి చేయాలని ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రజలకు నిరంతరం మానవతా సహాయం అందిస్తామని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అంతర్జాతీయ చట్టం, UN చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం ప్రాముఖ్యతపై రెండు దేశాలు ఏకీభవించాయి.

Leave A Reply

Your email address will not be published.