దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగదారుల ఉద్యమాన్ని పటిష్టం చేస్తాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దక్షిణాది రాష్ట్రాల్లో వినియోగదారుల ఉద్యమాన్ని పటిష్టం చేస్తాం – దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లెపాడు దామోదర్ అన్నారు. హైదరాబాద్ లోని ఏర్పాటు చేసిన వినియోగదారుల చైతన్య కార్యక్రమంలో పల్లెపాడు దామోదర్ ప్రసంగించారు. ప్రస్తుతం 24 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరు వినియోగదారుల హక్కుల పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన తప్పనిసరి అని, కాబట్టి వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ, వినియోగదారుల సంఘాలు గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు విస్తృతం అవుతున్న క్రమంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, కాబట్టి పోలీస్ శాఖ సహకారంతో వినియోగదారుల సంఘాలు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఇంకా నేటి కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ మామిడి భీం రెడ్డి, AICWC జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శిల్పా రెడ్డి, AICWC నేషనల్ సెక్రటరీ ఐజాక్ రాజ్, సి.సి.ఐ. సభ్యులు డా. హరిప్రియా రెడ్డి, పాల్గొని ప్రసంగించారు. అనంతరం తదుపరి మూడు సంవత్సరాలకు దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి కి అధ్యక్షుడు గా రెండవ మారు ఎన్నికైన డా. పల్లెపాడు దామోదర్ ను రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.